: విమానాన్ని సముద్రంలో 'ల్యాండ్' చేయబోయిన పైలట్


ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అందించిన సంకేతాలను తప్పుగా అర్థం చేసుకున్న ఓ పైలట్ విమానాన్ని సముద్రంలో ముంచబోయాడు. చివరకు తేరుకుని జాగ్రత్తగా రన్ వేపైకి తీసుకొచ్చి సురక్షితంగా దింపాడు. జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ320-200 విమానం జపాన్ లోని ఒకివా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అందించిన సంకేతాలను తప్పుగా అర్థం చేసుకుని, సముద్ర ఉపరితలానికి 75 మీటర్ల ఎత్తు వరకు తెచ్చేశాడు.

అనంతరం అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా రన్ వేపై లాండ్ చేశాడు. దీంతో విమానాశ్రయంలో టెక్నికల్ సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో ఆరుగురు సిబ్బంది సహా, 53 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News