: బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పరేఖ్ ను ప్రశ్నించనున్న సీబీఐ
బొగ్గు క్షేత్రాల కుంభకోణం కేసులో మాజీ కార్యదర్శి పీీసీ పరేఖ్ గురువారం (మే 1) సీబీఐ ముందు హాజరు కానున్నారు. తన అధికారాన్ని దుర్వినియోగపరచి హిందాల్కోకు బొగ్గు క్షేత్రాలను కేటాయించిన నేపథ్యంలో ఎల్లుండి సీబీఐ ఆయనను ప్రశ్నించనుంది. ఈ మేరకు తమ ఎదుట హాజరుకావాలంటూ పరేఖ్ కు అధికారులు తాజాగా సమన్లు జారీ చేశారు. దానిపై స్పందించిన పరేఖ్, తనకు సమన్లు అందాయని, ఆదేశించిన రోజున తప్పక హాజరవుతానని తెలిపారు.