: విద్యాశాఖ మంత్రి సమీక్షలో విస్తుగొలిపే నిజాలు..!
ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాధ్ కొంచెం సేపటిక్రితం రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు తీరును జూబ్లీహాల్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 884 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడట. 400 పాఠశాలల్లో నలుగురు లోపే విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక 1.284 ప్రాథమిక పాఠశాలల్లో 10మంది లోపు విద్యార్థులున్నారట. ఇవీ సర్కారీ లెక్కలు.
దీనిపై మంత్రి స్పందిస్తూ రాష్ట్రంలో 10 మంది లోపు ఉన్న పాఠశాలను మూసివేస్తామని ,1.60 లక్షల మంది చిన్నారులు పాఠశాల బయటే ఉన్నారని తెలిపారు. ఇంతకాలంగా 884 పాఠశాలలు విద్యార్థులు లేకుండానే, నలుగురికంటే తక్కువ విద్యార్థులతో 400 పాఠశాలలూ, అధ్యాపకులు.. సరంజామాతో నడిచిపోయాయన్నమాట...!