: విదేశాల్లో నల్లధనంపై కేంద్రం చర్యలు
విదేశాల్లోని బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు 18 మంది ఖాతాదారుల పేర్లు, పత్రాలను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. జర్మనీలోని లిచ్ టెన్ స్టిన్ బ్యాంకు ఖాతాదారుల వివరాలను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేసింది. 18 కేసుల్లో ఆదాయపన్ను శాఖ విచారణ, అభియోగాల నమోదును పూర్తి చేసినట్లు కేంద్రం తెలిపింది. అయితే, కేంద్రం సమర్పించిన పత్రాలపై విచారణను వచ్చే గురువారం చేపడతామని సుప్రీం తెలిపింది.