: జూన్ 2 తర్వాత విభజన ప్రక్రియ ముందుకు: జైరాం రమేష్
జూన్ 2 తర్వాత విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. మే 9న సమావేశమై విభజన ప్రక్రియను సమీక్షిస్తామని చెప్పారు. ఇక విభజనపై ఏర్పడిన 21 కమిటీల నివేదికలను మే 8న వెబ్ సైట్ లో పెడతామని వెల్లడించారు. అంతేగాక, ఉద్యోగుల పంపిణీపై మార్గదర్శకాలను కూడా అదే రోజు వెబ్ సైట్ లో ఉంచుతామన్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో మరో కమిటీ ఏర్పాటు చేస్తామని జైరాం వివరించారు.