: నెల్లూరులో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట
ఇందిరమ్మ బాట కార్యక్రమంలో రెండో రోజైన ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఇందులో భాగంగా ఆయన నెల్లూరు డీఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. కాగా సీఎం తొలివిడత ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని గతేడాది డిసెంబర్లో నిర్వహించారు.