: మిత్రపక్షాలతో కలసి మెజార్టీ సాధిస్తామని కాంగ్రెస్ నమ్ముతోంది: అహ్మద్ పటేల్
ఈసారి ఎన్నికల్లో కూడా విజయం ఖాయమని కాంగ్రెస్ నమ్ముతోంది. మే 16న జరిగే లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ రోజున మిత్రపక్షాలతో కలసి సంపూర్ణ మెజారిటీ సాధిస్తామని సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ అన్నారు. దానిపై తమకు నమ్మకం ఉందన్నారు. ఇక మూడోసారి కూడా బీజేపీకి ఓటమి తప్పదని చెప్పారు. దేశంలోని ప్రతి చోట నుంచి తమను ప్రోత్సహిస్తున్నట్లు ఫీడ్ బ్యాక్ అందుతోందన్నారు. దానివల్ల ప్రజలు బీజేపీ మోసకారితనాన్ని తెలుసుకుంటారని పేర్కొన్నారు.