: రావి వెంకటరమణపై చర్యలకు జాప్యమెందుకు?: ధూళిపాళ్ల
పొన్నూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి రావి వెంకటరమణ కంపెనీలోనే మద్యం డంప్ బయటపడిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, నకిలీ మద్యం భారీగా లభించినా రావి వెంకటరమణపై చర్యలు తీసుకునేందుకు ఇంకా ఎక్సైజ్ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, పొన్నూరు నియోజకవర్గంలో మంచి నీరు లభ్యం కాకపోయినా కాలువల్లో మద్యం ఏరులై పారుతోందని ఆయన విమర్శించారు.