: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు 14 మంది ఐపీఎస్ ల నియామకం
ఏడవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో రేపు జరుగుతున్న ఎన్నికల నిర్వహణ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు పద్నాలుగు మంది ఐపీఎస్ అధికారులను నియమించినట్లు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. హైదరాబాదు, సైబరాబాదు సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వారిని జిల్లా ఇన్ ఛార్జిలుగా నియమించినట్లు చెప్పారు.