: కోవూరు అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి కిడ్నాప్
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కిడ్నాప్ కు గురయ్యారని, ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని, నామినేషన్ ఉపసంహరణ గడువులోగా పోటీ నుంచి విరమించుకోవాలని ఆయనపై పలువురు నేతలు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అందుకు పోలంరెడ్డి నిరాకరించడంతో ఒప్పించేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన పోటీ నుంచి విరమించుకోకపోవడంతో ఆయనను కిడ్నాప్ చేశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.