: పాడు పని చేస్తావా? అంటూ ప్రాణం తీసిన తల్లి


మహారాష్ట్రలోని పర్బనీ జిల్లా ముద్గల్ గ్రామంలో ఓ మహిళ తన కుమార్తెను ఎవరో ఆగంతుకులు హత్య చేశారని, ఇంట్లోని నగదు, విలువైన వస్తువులు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వారి దర్యాప్తులో నమ్మలేని నిజం వెలుగు చూసింది. బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో బాలిక గర్భవతి అని తేలింది.

ఈ క్రమంలో బాలిక తల్లిపై అనుమానం కలిగి విచారించారు. విచారణలో మైనర్ అయిన తన కుమార్తె గర్భిణి అని తెలిసిందని, దానికి కారణం ఎవరని నిలదీయగా అతని పేరు చెప్పేందుకు బాలిక నిరాకరించిందని తెలిపింది. దీంతో విసిగిపోయిన ఆ తల్లి కనీసం అబార్షన్ అయినా చేయించుకోమని సలహా ఇచ్చింది. దీంతో ఆ బాలిక దానిని కూడా తిరస్కరించింది.

దీంతో చేసిన పాడుపని చాలక, చెప్పిన మాట వినవా? అంటూ ఆగ్రహంతో గొడ్డలితో బాలికను తెగనరికింది. బాలిక ప్రాణాలు విడువడంతో హత్య విషయం బయటపడితే బాలిక గర్భిణి అని బయటపడుతుందని, పరువు పోతుందని భావించిన తల్లి, తన కుమార్తెను ఆగంతుకులు హత్య చేసి దోపిడీ చేశారని కథ అల్లినట్టు ఒప్పుకుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News