: కీచక పోలీస్ పై కేసు నమోదు!
ఒడిశాలో ఓ సీనియర్ పోలీస్ అధికారి కామావతారం ఎత్తారు. సహచర ఉద్యోగినికి అసభ్యకర ఎస్ఎంఎస్ లు పంపిస్తూ వేధిస్తున్నాడు. కేంద్రపర జిల్లా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సదరు కీచక సీనియర్ పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. గతేడాదే అమల్లోకి వచ్చిన పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద తొలి కేసుగా దీన్ని నమోదు చేశారు.