: అప్పుడే అమ్మేంటి?: విద్యాబాలన్
'అదిగో... బాల ప్రెగ్నెంట్'... 'ఇదిగో... బాల ప్రెగ్నెంట్' అంటూ వస్తున్న వార్తలతో విద్యాబాలన్ చిరాకుపడుతోంది. 'ఎందుకు అందరూ నా పొత్తి కడుపువైపే చూస్తున్నారు? నటీనటులను ఎందుకలా ప్రత్యేకంగా చూస్తారు? ఇన్షా అల్లా, నాకు బేబీ కావాలి. కానీ ఇప్పుడే కాదు. తల్లి పాత్రకు నేనింకా మానసికంగా సిద్ధంగా లేను' అంటూ బాల తన మనసులోని విషయాన్ని ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది.