: విమానంలో మంటలు... చాకచక్యంగా వ్యవహరించిన పైలట్


పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోబమ్ ఏవియేషన్ కు చెందిన విమానం గాలిలోకి ఎగిరింది. ఎగిరిన కొన్ని క్షణాలకే ఓ ఇంజిన్ లో మంటలు చెలరేగినట్టు పైలట్ గుర్తించాడు. దీంతో వెంటనే ఈ ఇంజిన్ ను ఆపివేసి విమానాన్ని తిరిగి విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. విమానం గాలిలోకి లేచిన సమయంలో అందులో 93 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ప్రయాణికులంతా సురక్షితమని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కోబమ్ ఏవియేషన్ తెలిపింది.

  • Loading...

More Telugu News