: ఎతిహాద్ విమానం శంషాబాద్ లో అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ విమానాశ్రయంలో యూఏఈకి చెందిన ఎతిహాద్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. అబుదాబి నుంచి జకార్తా వెళ్తున్న విమాన ప్రయాణికుల్లో ఓ మహిళకు గుండెపోటు రావడంతో అత్యవసరంగా విమానాన్ని దించారు. చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు.