: తాగే నీరు కలుషితమైతే... ఈ గోలీ చెప్పేస్తుంది
తాగే నీరు కలుషితమైందనే సందేహం ఉందా? ఆందోళన విడిచిపెట్టండి. ఈ చిన్న గోలీ తీసుకెళ్లి కొన్ని నీళ్లలో వేయండి. నీటి రంగు మారిపోయిందా? అయితే, కలుషితమైనట్లే. నీటి స్వచ్ఛతను తెలుసుకోవడాన్ని సులభతరం చేస్తూ మెక్ మాస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు. ఈ చిన్న మాత్రలో నీటిని పరీక్షించే టెక్నాలజీని అమర్చారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా నీటి పరీక్ష మరింతగా అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.