: ఈ నియోజకవర్గంలో గెలిచే పార్టీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది


రాజకీయాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతుంటాయంటారు పరిశీలకులు. తలా తోక లేని సంఘటనలు అసంకల్పితంగా నిజాలుగా మారుతుంటాయి. దీంతో ఆ నమ్మకాలు సంప్రదాయాలుగా మారుతుంటాయి. గుజరాత్ లోని వల్సడ్ నియోజకవర్గంపై ఇలాంటి నమ్మకమే ఒకటి రాజ్యమేలుతోంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందితే ఆ పార్టీయే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకొంటున్నారు.

అందుకే దీనిని గేట్ వే టు ఢిల్లీ అని ముద్దుగా పిలుస్తారు. ఇక్కడ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ గెలుపొందేది. తొలిసారి 1996లో వల్సడ్ లో బీజేపీ గెలిచింది. దీంతో కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది కేవలం 13 రోజులే కొనసాగింది. తరువాత 1998, 1999ల్లో బీజేపీ గెలిచింది. ఈ సారి కూడా కేంద్రం లో వాజ్ పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

2004, 2009ల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిషన్ పటేల్ గెలిచారు. దీంతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సెంటిమెంటు 1977 నుంచి కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. రెండుసార్లు ఇండింపెండెట్లు గెలిస్తే కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీంతో అందరికీ ఇక్కడ ఎవరు గెలిస్తే వారి పార్టీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే నమ్మకం బలపడిపోయింది. ఈసారి వల్సడ్ లోక్ సభలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ ఉంది.

  • Loading...

More Telugu News