: కాశీలో భయానక వాతావరణం: కేజ్రీవాల్
కాశీలో తమ కార్యకర్తలపై దాడి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ నేతలు బెదిరిపోతున్నారు. దీనిపై ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈ రోజు వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ... వారణాసి పట్టణంలో భయానకర వాతావరణాన్ని సృష్టించారని అన్నారు. నిన్న ఆమ్ ఆద్మీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కాశీ సంస్కృతి కానేకాదన్నారు. ఇలా హింసను పునరుద్ధరిస్తున్నది బీజేపీ గూండాలేనని మండిపడ్డారు. తాజా దాడి నేపథ్యంలో వారణాసిలో మరిన్ని బలగాలను దింపాలని ఎలక్షన్ కమిషన్ ను ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ కోరారు.