: గృహ హింస ఆరోపణలతో కేరళ మంత్రి రాజీనామా


వరకట్నం, గృహ హింస ఆరోపణలు వస్తే సామాన్యుడే కాదు మంత్రైనా, ఎవరైనా ఒకటే. ఇటీవలే ఒడిషా న్యాయశాఖ మంత్రిపై తీవ్ర వరకట్న ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఊచలు లెక్కపెడుతున్నారు. ఇప్పుడు తాజాగా కేరళ మంత్రి గృహహింస ఆరోపణలు ఎదుర్కొనడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

కేరళ అటవీ శాఖ మంత్రి కేబీ గణేశ్ కుమార్ తనను హింసిస్తున్నాడంటూ భార్య యామిని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని మంత్రి కోర్టు కెళ్లారు. వెంటనే ఆమె గృహహింస నేరం కింద మంత్రిపై కేసు పెట్టడంతో పదవికి రాజీనామా చేశారు. కేరళలో కాంగ్రెస్-యూపీఎఫ్ సంకీర్ణ కూటమితో కొనసాగుతున్న ప్రభుత్వంలో గణేశ్ కుమార్ ఒక్కరే కాంగ్రెస్ కు చెందిన మంత్రి.
 

  • Loading...

More Telugu News