: రాజమండ్రి లాయర్ అతి తెలివి
రాజమండ్రిలో నాగరాజు అనే లాయర్ అతి తెలివి ఉపయోగించాడు. డబ్బు సంపాదనకు అడ్డదారులు తొక్కాడు. తను చదివిన విద్య, విజ్ఞానాన్ని చిల్లర పనులకు ఉపయోగించాడు. నాగరాజు కోర్టుకి వెళ్లి కేసులు వాదించడం మానేసి, కేసులు వాదించమని తన దగ్గరకొచ్చిన నలుగురు చేయితిరిగిన దొంగలతో సహవాసం చేశాడు. వారిని చేరదీసి గుట్టుగా దొంగతనాలు చేయించాడు. ఆ నలుగురు దొంగలకు నాగరాజు సహకరించేవాడు.
అదీ చాలదన్నట్టు వారు చేసే దొంగతనాల్లో తాను కూడా ఓ చేయివేసేవాడు. ఈ క్రమంలో అనేక సార్లు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. తాజాగా మళ్ళీ అతన్ని, అతని నలుగురు అనుచరులను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు ఓ ల్యాప్ టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.