: అల్లారఖా చిత్రంతో రూపొందిన ఇవాళ్టి గూగుల్ డూడుల్
ప్రముఖ తబలా విద్వాంసుడు అల్లారఖాను స్మరిస్తూ గూగుల్ ఇవాళ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. గూగుల్ హోం పేజీ తెరవగానే ఓ వ్యక్తి నిండుగా నవ్వుతూ తబలా వాయిస్తున్న చిత్రాన్ని చూడవచ్చు. భారతీయుడైన అల్లారఖాను గూగుల్ సంస్థ గౌరవిస్తూ, ఆయనకు నివాళులర్పించింది. అల్లా రఖా 1919 సంవత్సరం ఏప్రిల్ 29న జమ్మూలో జన్మించారు. 12 ఏళ్ల ప్రాయంలోనే ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఆయన తబలా నేర్చుకుని... 1936లో లాహోర్ లోని ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. 1943లో ఆయన ఏఆర్ ఖురేషీ పేరుతో చిత్రరంగంలోకి ప్రవేశించారు. తబలా విద్వాంసుడిగా ఆయన పద్మశ్రీ అవార్డును, సంగీత్ అకాడమీ అవార్డును అందుకున్నారు. 2000 ఫిబ్రవరి 3న ముంబయిలో గుండెపోటుతో అల్లారఖా మరణించారు.