: మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేసిన ఖమ్మం ఎస్పీ
తెలంగాణలో రేపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, పోలీసు వ్యవస్థ అలర్ట్ అయింది. ఈ క్రమంలో మావోయిస్టులకు ఖమ్మం జిల్లా ఎస్పీ రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. చత్తీస్ గఢ్ లో ఎన్నికలు జరిగే సమయంలో ఎన్ కౌంటర్లు జరిగిన సంగతిని మావోలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో మావోయిస్టులతో సంబంధాలున్న వారందరినీ అరెస్ట్ చేశామని ఎస్పీ చెప్పారు. ఆంధ్రా, చత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.