: మరోసారి ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆడిటర్ విజయసాయి రెడ్డి మరోమారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఈ రోజు హాజరుకానున్నారు. న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు సాయిరెడ్డిని విచారిస్తారు. ఇప్పటికే జగన్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఆయనను విచారించిన సంగతి తెలిసిందే.