: డబ్బులు పంచుతూ దొరికిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి పీఏ
కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంతరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఫణీందర్ రెడ్డి, గణేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న (సోమవారం) రాత్రి కూకట్ పల్లి నిజాంపేటలో వారిద్దరూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే వారిని అరెస్టు చేసి, రూ.24వేల నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.