: స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీనివాసన్, మరో 12 మంది క్రికెటర్లపై అభియోగాలు
ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ మాజీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్, మరో 12 మంది క్రికెటర్లపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే, వారిపై విచారణకు బీసీసీఐ ఏర్పాటు చేసిన ముగ్గురు వ్యక్తుల కమిటీపై సుప్రీం తీర్పు వాయిదా వేసింది. అటు ఈ కేసు విచారణకు సహాయం చేసేందుకు తమకు ఓ సీబీఐ మాజీ డైరెక్టర్ అవసరమని జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సుప్రీంను కోరింది.