: మిర్చి ఘాటుతో అల్లాడుతున్న ఎన్నికల సిబ్బంది
అసలే మండుతున్న ఎండలు... దీనికి తోడు ముక్కుపుటాలు అదిరే మిర్చి ఘాటు... పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పడు కొంతమంది ఎన్నికల సిబ్బంది ఈ నరకాన్ని స్వయంగా అనుభవిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లే, వరంగల్ ఏనుమాముల మిర్చి యార్డులో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఎంతో ఉత్సాహంగా విధులు నిర్వహించేందుకు వచ్చిన ఎన్నికల సిబ్బందికి ఇక్కడ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది.
మిర్చి ఘాటుకు ఒకటే తుమ్ములు, దగ్గులు! ఇక ఆస్తమా లాంటివి ఉన్న వారి పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది. వరంగల్ లో ఎన్నో ప్రదేశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మిర్చియార్డులో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడంపై వారు మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతున్నారు. తుమ్ములను తట్టుకోలేక ముఖానికి కర్చీఫ్ లు, చీర కొంగులు అడ్డం పెట్టుకుంటున్నారు.