: వాద్రా అలాంటివాడైతే... రాజస్థాన్ ప్రభుత్వం ఎందుకు ఊరుకుంది?: దిగ్విజయ్


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూతురు ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలను బీజేపీ టార్గెట్ చేయడంతో... కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బీజేపీ విమర్శల జడివాన నుంచి వీరిని కాపాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రియాంక మచ్చలేని మహిళ అని... ఆమెపై బీజేపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీనికితోడు, రాబర్ట్ వాద్రాపై బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. వాద్రా నిజంగా తప్పుచేసినట్టైతే... రాజస్థాన్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నిలదీశారు.

  • Loading...

More Telugu News