: మాజీ మంత్రి పార్థసారథి ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశం
మాజీ మంత్రి పార్థసారథి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కొద్ది రోజుల క్రితం పార్థసారథి సతీమణి కమల రూ. 40 లక్షలు తరలిస్తూ హైదరాబాద్ వనస్థలిపురం వద్ద పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పార్థసారథి కీలక నిందితుడని పోలీసులు నిర్ణయించారు. దీంతో, ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, పార్థసారథిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం పార్థసారథి మచిలీపట్నం లోక్ సభ స్థానానికి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్నారు.