: నోకియా కొత్త బాస్ గా భారతీయుడు
మార్కెట్ వర్గాల అంచనాలకు తగినట్లుగానే నోకియాకు నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారిగా(సీఈవో) భారత్ కు చెందిన రాజీవ్ సూరి నియమితులయ్యారు. ముఖ్యమైన మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కు నోకియా విక్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై నెట్ వర్క్స్, నేవిగేషన్, పేటెంట్ల వ్యాపారంపై ఫిన్లాండ్ కు చెందిన నోకియా దృష్టి పెట్టనుంది. కంపెనీని నడపడానికి రాజీవ్ సూరి తగిన వాడని నోకియా చైర్మన్ రిస్తో సైలస్మ ఒక ప్రకటనలో తన అభిప్రాయాన్ని తెలిపారు. రాజీవ్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడని చెప్పారు. 1967లో భారత్ లోనే జన్మించిన రాజీవ్ మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివారు.