: శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ ఉదయం జిల్లాలోని సీతంపేట మండలం బిల్లమడ గ్రామంలోకి చొరబడి అక్కడి పాకలను ధ్వంసం చేశాయి. దాంతో పాటు జీడిమామిడి తోటలను సర్వ నాశనం చేశాయి. అటు ఏనుగులు ఒక్కసారే గుంపుగా రావడంతో గిరిజనులు భయంతో పరుగులు పెట్టారు.