: 45 ఏళ్ల రాహుల్ యువకుడా?: ఆమ్ ఆద్మీ నేత
యువకులు రాజకీయాల్లో అవకాశాలు దక్కించుకోవాలంటున్నారు ఆమ్ ఆద్మీ తరపున లక్నో నుంచి పోటీ చేస్తున్న నటుడు జావేద్ జఫ్రీ. తాము యువతకు దగ్గరయ్యామని, వారిని తమతో చేతులు కలపమని అడుగుతున్నామని తెలిపారు. 26 ఏళ్లలోపు వయసున్న ఎమ్మెల్యేలూ తమ పార్టీలో ఉన్నారని చెప్పారు. అదే సమయంలో రాహుల్ గాంధీని యువకుడిగా పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. 40 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారిని యువకులుగా పిలవరాదన్నారు.