: వారణాసిలో మోడీ విజయం ఖరారైనట్లే
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానంలో విజయం దాదాపుగా ఖాయమైనట్లే. ఎందుకంటే నామినేషన్ సందర్భంగా వారణాసి ప్రజలు నరేంద్రుడికి అపూర్వ స్వాగతం, మద్దతు పలకడం మనం చూశాం. పైగా వారణాసిలో గుజరాతీలు 70వేల మంది ఉన్నారు. ఇక్కడ వారు చీరలు తదితర వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు వారంతా మోడీకి ఏకపక్షంగా ఓట్లేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. మోడీ వారణాసి స్థానాన్ని ఎంచుకోవడంపై స్థానిక గుజరాతీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇక్కడ బీజేపీకి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో మోడీ విజయం నల్లేరుపై నడకే కాగలదు.