: ప్రపంచయాత్రకు సై అంటున్న కుక్క
ఫరెగ్జాంపుల్.. మీరు ప్రపంచపటాన్ని ఎదురుగా పెట్టుకుని యథాలాపంగా ఓ చోట వేలు పెట్టి సెలక్టు చేశారనుకోండి. మహా అయితే ఏమవుతుంది? ఆ ప్రదేశం తాలూకు బొమ్మలను, వీడియోలను మీరు య్యూట్యూబ్‌లోకి వెళ్లి చూసి ఆనందించవచ్చు. అంతకు మించి.. వేలు పెట్టిన ప్రతి చోటూ వెళ్లి చూసి రావాలంటే.. సాధ్యం కాదు. కానీ ఆ కుక్క గారి సంగతి అలా కాదు. ఏడాదికోమారు.. తన ఎదురుగా ఉండే ప్రపంచపటంలో అది ఎక్కడ కాలు పెడితే ఆ ప్రదేశానికి అది అధికారికంగా వెళ్లి పర్యటించి వస్తుంది. తన సహాయకుడితో కూడా! సహాయకుడు అంటే మరో కుక్క కాదు సుమండీ.. ఒక మనిషి. అవును మరి.. ఏ కుక్కకైనా తన బ్యాంకు ఖాతాలో 993,700 అమెరికన్ డాలర్లు ఉన్నట్లయితే అలాంటి వైభోగమే సాగుతుంది.
వివరాల్లోకి వెళితే.. రష్యా వద్ద బెలారెస్ లోని బుడోచ్కా గ్రామానికి చెందిన జాన్ ఫ్యోడోరోప్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో సెటిలయ్యాడు. ఆయనకు వాలెట్ అనే కుక్క ఉండేది. ఓ సందర్భంలో దానికి జబ్బు చేసింది. చికిత్స గురించి జాన్ పట్టించుకోకపోవడంతో అది మరణించింది. తన నిర్లక్ష్యం వల్లనే అది మరణించిందని పశ్చాత్తాపపడ్డ ఫ్యోడోరోవ్ 2007లో బుడోచ్కా గ్రామానికి వెళ్లినప్పుడు.. అక్కడ వాసిలీ పొటాపోవ్‌కు చెందిన జూలిక్ అనే కుక్కను చూశాడు. అది అచ్చం 1950లలో చనిపోయిన తన వాలెట్‌నే పోలి ఉన్నదని చెప్పాడు. దానిని ఆదరించడం ద్వారా తన తప్పునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఫ్యోడోరోవ్ అనుకున్నాడు.
ఆయన విల్లులోని చివరి కోరిక మేరకు.. ఆయన ఆస్తుల్లోంచి పైన చెప్పిన మొత్తంతో జులిక్ పేరిట లాయరు మరియా బ్యాంకు అకౌంటు ప్రారంభించారు. పైన పేర్కొన్న వసతులన్నీ ఆ కుక్కకు ఏర్పాటయ్యాయి. అది ప్రపంచ పర్యటనకు వెళ్లినప్పుడెల్లా.. దాని ప్రస్తుత యజమాని వాసిలీ పొటాపోవ్ కూడా వెళ్తుంటారన్నమాట.
అదీ కథ!
- Loading...
More Telugu News
- Loading...