: తిరుమలేశుని దర్శించుకున్న నారా రోహిత్
తిరుమల శ్రీవారిని సినీ నటుడు నారా రోహిత్ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను రోహిత్ కు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన రోహిత్... తను చిత్రం 'ప్రతినిధి' ప్రేక్షకాదరణ పొందుతున్నందున స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు చెప్పారు. గుంటూరు జిల్లాలో మే 2న టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నట్టు తెలిపారు.