: ఇప్పటికి 52 రోజులు... ఫలితం మాత్రం శూన్యం
దక్షిణ హిందూ మహాసముద్రంలో గల్లంతైన మలేసియా విమానం ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించి 52 రోజులు గడిచింది. విమానాలు, నౌకలు కలసి గాలిస్తున్నా ఫలితం లేదు. దీంతో అమెరికా నుంచి తెప్పించిన రిమోట్ ఆధారిత జలాంతర్గామికి ఈ పని అప్పజెబుతున్నారు. 'బ్లూఫిన్' అనే ఈ జలాంతర్గామి ఇప్పటి వరకు 15 ఆపరేషన్లు పూర్తి చేసింది. అయినప్పటికీ విమానం ఆచూకీ అన్వేషణలో ఇది కూడా ఏ విధమైన పురోగతీ సాధించలేదు.
తాజాగా నేటి నుంచి ఈ జలాంతర్గామి 16వ మిషన్ ప్రారంభించింది. ఇంకెన్ని రోజులు అన్వేషణ కొనసాగుతుందో, శతాబ్దపు మిస్టరీ ఎప్పుడు వీడుతుందోనని చైనా, మలేసియా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆచూకీ గల్లంతైన విమానంలోని ప్రయాణికుల్లో అత్యధికులు చైనీయులు.