: బంగారు తెలంగాణ కోసం తల ముక్కలైనా పర్లేదు... డోంట్ కేర్: పవన్ కల్యాణ్
చిటిక వేస్తే వేయి తునకలవుతాడని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మాటలతో తన తల్లి బాధ పడ్డారని చెప్పారు. ఈ రాజకీయాలు ఎందుకు, ఎవరితో పడితే వారితో ఎందుకు మాటలు అనిపించుకోవాలని అడిగారని తెలిపారు. అయితే, బంగారు తెలంగాణ కోసమే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టానని తన తల్లికి చెప్పినట్టు పవన్ చెప్పారు. బంగారు తెలంగాణ కోసం తన తల పగిలినా, నెత్తురు చిమ్మినా లెక్క చేయనని తెలిపారు.