: ఆర్కిటిక్‌లో మంచు కరిగి.. మొక్కలు పెరగబోతున్నాయ్‌


భూమి ధ్రువాలు ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ అనగానే.. కనుచూపుమేరా.. మంచుతో కప్పబడిన అపారమైన భాభాగం మాత్రమే మనకు గుర్తుకు వస్తుంది. అయితే గ్లోబల్‌ వార్మింగ్‌.. భూతాపం అనేది.. అక్కడి పరిస్థితుల్లో కూడా మార్పు తెచ్చేయబోతున్నదట. నిత్యం తెల్ల దుప్పటి కప్పినట్లుగా ఉండే ఆర్కిటిక్‌ ప్రాంతంలో రాబోయే రోజుల్లో వృక్షసంపద 50 శాతం వరకు పెరుగుతుందిట. ఆ మేరకు మంచు కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో పెరుగుతున్న వేడివలన ఈ పరిస్థితి తలెత్తుతుందని.. అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీలోని బయోడైవర్సిటీ కేంద్రం వారి పరిశోధన తేల్చింది. 

  • Loading...

More Telugu News