: ఇకపై నకిలీ క్రెడిట్ కార్డులను తయారుచేయడం కష్టమే!


క్రెడిట్ కార్డు మోసాలు ఇటీవల ఎక్కువ కావడంతో... ఈ తరహా మోసాలకు చెక్ చెప్పేందుకు శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఇకపై నకిలీ క్రెడిట్ కార్డులను తయారు చేయడం.... నకిలీ కరెన్సీ ముద్రించడం కష్టమే! అంతేకాదు, నకిలీ గ్యాడ్జెట్స్ ను కూడా తయారుచేయలేరు. ఎందుకంటే, క్రెడిట్ కార్డుల తయారీలో మన కంటికి కనిపించని నానో ఫింగర్ ప్రింట్స్ ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ నానో ఫింగర్ ప్రింట్స్ ను క్రెడిట్ కార్డులు, కరెన్సీల్లో ఉంచితే వాటిలోని సమాచారాన్ని ఉపయోగించి డూప్లికేట్ కార్డులను తయారుచేయడం కష్టమని వారు స్పష్టం చేస్తున్నారు. నానో ఫింగర్ ప్రింట్స్ పద్ధతిలో కరెన్సీ నోట్లను తయారుచేయడమే వైవిధ్యంగా ఉంటుందని, 50 మైక్రో మీటర్లుండే నానో వైర్లకు నకిలీలు తయారుచేయడం దాదాపు అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News