: శోభ గెలిస్తే ఉపఎన్నిక నిర్వహిస్తాం... వైకాపాకు ఈసీ లేఖ
వైఎస్సార్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి మృతితో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, ఎలెక్షన్ కమిషన్ వైఎస్సార్సీపీకి లేఖ రాసింది. ఎన్నికల్లో శోభకు అత్యధిక ఓట్లు పడితే ఉపఎన్నిక నిర్వహిస్తామని లేఖలో స్పష్టం చేసింది.