: హైకోర్టులో కేవీపీకి తాత్కాలిక ఊరట
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కేవీపీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రొవిజనల్ అరెస్టుకు రెడ్ కార్నర్ నోటీసు సరిపోదని, అరెస్ట్ వారెంట్ కూడా ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.