: పురందేశ్వరిపై పెప్పర్ స్ప్రే దాడి


చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజంపేట బీజేపీ లోక్ సభ అభ్యర్థి పురందేశ్వరికి ఊహించని అనుభవం ఎదురైంది. పుంగనూరు శాసనసభ నియోజకవర్గంలోని సోమలలో టీడీపీ అభ్యర్థి రాజుతో కలసి ప్రచారం నిర్వహిస్తుండగా... గుర్తు తెలియని వ్యక్తి గాల్లోకి పెప్పర్ స్ప్రేను వెదజల్లాడు. దీంతో పురందేశ్వరితోపాటు ఆమె చుట్టూ ఉన్న వారు కూడా తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో కొంత సేపు ఎన్నికల ప్రచారానికి అంతరాయం కలిగింది. కాసేపటి తర్వాత తన ప్రచారాన్ని కొనసాగించిన పురందేశ్వరి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని... ఇలాంటి వాటికి తాను భయపడనని చెప్పారు.

  • Loading...

More Telugu News