: నారాయణమూర్తికి 'గ్లోబల్ ఇండియా అవార్డు'


ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తికి మరో గౌరవం దక్కింది. ఐటీ రంగానికి ఆయన అందించిన సేవలకు గాను ఆయనను 'కెనడా ఇండియా ఫౌండేషన్ చంచలానీ గ్లోబల్ ఇండియా అవార్డు-2014' పురస్కారంతో సత్కరించారు. ఈ అవార్డును కెనడా ఆర్థిక శాఖ మంత్రి జాయ్ ఓలివర్ నారాయణమూర్తికి అందజేశారు. అవార్డుతో పాటు 50 వేల అమెరికా డాలర్లు కూడా మూర్తికి అందించారు. ఈ కార్యక్రమానికి భారత హైకమిషనర్ నిర్మల్ వర్మ కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News