: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల


ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. గవర్నర్ నరసింహన్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాల సీడీని విడుదల చేశారు. 55.48 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఈసారి ఫలితాల గ్రేడులతో పాటు మార్కులను కూడా అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ల నుంచి టోల్ ఫ్రీ నెంబరు 1800-425-1110కు ఫోన్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే, ఈ పరీక్షా ఫలితాలను www.examresults.ap.nic.in, www.manabadi.com, www.apit.ap.gov.in తదితర వైబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News