: బాబా రాందేవ్ ప్రచారం చేయడానికి వీల్లేదు: ఈసీ


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనకు పెద్ద చిక్కొచ్చి పడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈసీ చర్యలు తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గాల్లో బాబా రాందేవ్ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వీల్లేదని ఈసీ ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ (సోమవారం) రాందేవ్ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా, చంబా, నూర్పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే రాందేవ్ ప్రచారాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. అలాగే అమేథీలోని మే 1, 2వ తేదీల్లో రాందేవ్ బీజేపీ తరపున ప్రచారం చేయాల్సి ఉండగా... అక్కడ కూడా ప్రచారం చేయవద్దని ఈసీ ఆదేశించింది.

  • Loading...

More Telugu News