: కేసీఆర్ ఓ పిరికిపంద, ఓ పిచ్చోడు: చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. మెదక్ జిల్లా గజ్వేల్ (ఇక్కడ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు)లో ఈ రోజు ఆయన ప్రసంగించారు. ఫాంహౌస్ లో ఎకరాకు కోటి సంపాదిస్తున్నానంటున్న కేసీఆర్... అవినీతి పంట పండిస్తున్నారని అన్నారు. తాను తలచుకుంటే ఫాం హౌస్ నుంచి కేసీఆర్ బయటకు అడుగు కూడా పెట్టలేడని చెప్పారు. కేసీఆర్ ఓ పిరికిపంద, ఓ పిచ్చోడు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పిచ్చాసుపత్రికి పంపిస్తామని... ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరించారు.

కేసీఆర్ ను పరుగులు పెట్టించేంత వరకు తాను వదిలిపెట్టనని చంద్రబాబు చెప్పారు. 'గతంలో కేసీఆర్ నన్ను మోసం చేశాడు, ఇప్పడు కాంగ్రెస్ ను మోసం చేశాడు, రేపు తెలంగాణ ప్రజలను మోసం చేస్తాడని' అన్నారు. కేసీఆర్ పతనం గజ్వేల్ నుంచే ప్రారంభమైందని... టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డికి ఓటేస్తే... కేసీఆర్ ను తరిమి కొడతారని చెప్పారు. ప్రతాప్ రెడ్డి ఊదితే కేసీఆర్ గోదావరిలో పడతాడని అన్నారు. ఎన్టీఆర్ తో పెట్టుకుని ఇందిరాగాంధీ అడ్రస్ లేకుండా పోయిందని, తనతో పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయాడని... ఇప్పుడు కేసీఆర్ కు కూడా అదే గతి పడుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News