: చంద్రబాబు గజ్వేల్ సభలో టీఆర్ఎస్ కార్యకర్త హంగామా
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్ లో చంద్రబాబు సభలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త హంగామా చేశాడు. సభలో చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడు. దీంతో టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదిస్తూ, టీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశారు. వెంటనే పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తను లాక్కెళ్లారు. అనంతరం చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తూ కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.