: మోడీని ప్రధాని చేస్తే హైదరాబాద్ వదులుకున్నట్టే: కేసీఆర్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కేసీఆర్ వాగ్బాణాలు సంధించారు. మోడీ ప్రధాని అయితే హైదరాబాదును తెలంగాణకు కాకుండా చేస్తారని ఆరోపించారు. అందువల్ల బీజేపీకి ఓటు వేసేముందు తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. మోడీ ముసుగులో చంద్రబాబు, వెంకయ్యనాయుడులు తెలంగాణలో పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.