: కేవీపీ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ
రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది. కేవీపీ పిటిషన్ పై సీఐడీ సమాధానం ఇవ్వాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సీబీఐ కూడా ఇవాళ ఈ కేసుకు సంబంధించి నోటీసు అందజేసే అవకాశం ఉంది. టైటానియం స్కాంలో ఎఫ్ బీఐ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుపై స్టే ఇవ్వాలంటూ కేవీపీ రామచంద్రరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. కేవీపీ ప్రొవిజినల్ అరెస్టుకు సంబంధించి న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా సీబీఐ సమాలోచనలు చేస్తోంది.