: వైఎస్సార్సీపీ నేత బాలశౌరిపై దాఖలైన పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలశౌరిపై దాఖలైన పిటీషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. నెల్లూరులో బాలశౌరికి జరిపిన భూకేటాయింపులపై వరప్రసాద్ అనే వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లో భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ పిటిషనర్ కోరడాన్ని కోర్టు తోసిపుచ్చింది. గతంలో సీబీఐకి అధికారాలు లేవని గౌహతి కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని పిటిషనర్ దృష్టికి తీసుకువచ్చింది.