: ప్లాస్టిక్ సర్జరీని తలదన్నే.. త్రీడీ ప్రింటింగ్ అద్భుతం!
విపరీతమైన పరిస్థితుల సందర్భంలో ముఖంలోని కొంత భాగాన్ని తొలగించేయడం వంటివి జరిగిన వ్యక్తులకు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఆ అవయవాన్ని తిరిగి యథాతథంగా కనిపించేలా చేయడం అనే ప్రయోగం విజయవంతం అయింది. ముఖం, ఇతర ప్రధాన శరీర భాగాలు దారుణంగా దెబ్బతిన్న వారికి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పరిస్థితిని చక్కదిద్దడం మాత్రమే ఇన్నాళ్లూ అందుబాటులో ఉండేది. దాన్ని అధిగమించే సాంకేతిక అద్భుతంగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ లండన్లో ఆవిష్కృతమైంది.
ప్రపంచంలోనే మొదటిసారిగా బ్రిటన్ వైద్యులు త్రీడీ ప్రింటింగ్లో కృత్రిమంగా మొహాన్ని తయారు చేశారు. 60 ఏళ్ల ఎరిక్ మోగర్ అనే వ్యక్తికి క్యాన్సర్ సోకడంతో.. మొహంలో ఎడమవైపు కొంత భాగం తొలగించారు. అయితే ఆహారం గొట్టం ద్వారా తప్ప నోటిద్వారా తీసుకోవడం సాధ్యమయ్యేది కాదు. మొహాన్ని అతికించడానికి ప్లాస్టిక్ సర్జరీ ప్రయత్నాలు కూడా కీమోథెరపీ వంటి వాటి వల్ల ఫలించలేదు. దీంతో వైద్యులు, ఆండ్రూ దావూద్ అనే మరో ఇంప్లాంట్ స్పెషలిస్ట్ అయిన వైద్యుడి సహకారంతో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో అతడి మొహాన్ని మళ్లీ నిర్మించారు.
ఇది తనకు కొత్త జీవితం ప్రసాదించినట్లుగా ఉందని ఎరిక్ మోగర్ సంబర పడిపోతున్నాడు.
- Loading...
More Telugu News
- Loading...